తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాజకీయాలకు అతీతంగా ప్రజా సేవ' - minister srinivas goud

నారాయణపేట సింగారం చౌరస్తాలోని తెరాస జిల్లా పార్టీ కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు నిత్యాసరాలు పంపిణీ చేశారు.

blood donation camp at narayanpet
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

By

Published : May 2, 2020, 8:07 AM IST

తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణపేట మండలం సింగారం చౌరస్తాలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కేటీఆర్ పిలుపుతో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. తెరాస ఆవిర్భవించిందే ప్రత్యేక రాష్ట్ర సాధనకని మంత్రి చెప్పారు.

కొవిడ్‌-19 నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేస్తున్నామన్నారు. రాజకీయాలు చేసేందుకు ఇది సందర్భం కాదని... ఆకలితో ఉన్న వారిని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని సూచించారు.

అనంతరం మహిళా సంఘాల సభ్యులు, పేదలకు నిత్యావసర సరకులు, మాస్కులు పంపిణీ చేశారు‌. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నాయకులు, కార్యకర్రలు, యువకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ

ABOUT THE AUTHOR

...view details