నారాయణపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎస్పీ డాక్టర్ చేతన ప్రారంభించారు. స్థానిక హెడ్ క్వార్టర్స్‌కు చెందిన ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, సిబ్బంది రక్తదానం చేశారు. రక్తదానం చేసి మరొకరికి ప్రాణ దానం చేయాలని ఎస్పీ కోరారు. రక్తదానం చేసిన 33 మంది సిబ్బందిని అభినందించారు.
నారాయణపేటలో పోలీసుల రక్తదానం - నారాయణపేటలో పోలీసుల రక్తదానం
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ఎస్పీ డాక్టర్ చేతన ప్రారంభించారు. స్థానిక హెడ్ క్వార్టర్స్‌కు చెందిన ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, సిబ్బంది రక్తదానం చేశారు.
పోలీసుల రక్తదానం