నారాయణపేట జిల్లా కేంద్రంలో నూతన రక్తనిధి కేంద్ర భవనాన్ని నిర్మించారు. కలెక్టర్ వెంకట్రావు, జడ్పీ ఛైర్ పర్సన్ వనజ, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి కలిసి ప్రారంభించారు. గతంలో జిల్లా ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన బాలింతలకు రక్తం తెచ్చుకునేందుకు మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్లేవారు. రోగులకు ఎలాంటి సమస్య రాకూడదనే నూతన రక్త నిధిని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే బ్లడ్ బ్యాంక్‌కు సంబంధించి వెబ్సైట్ ప్రారంభిస్తున్నట్లు.. అందులో అన్ని వివరాలు అందజేస్తామని వెంకట్రావు చెప్పారు.
నూతన రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే - blood bank inaugurated by collector venkatrao
నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జడ్పీ ఛైర్ పర్సన్ వనజ, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన నూతన రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభించారు.
నూతన రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్