తెలంగాణ

telangana

ETV Bharat / state

'సర్పంచులు గల్లీల్లో గల్లలెగరేసుకుని తిరిగేలా చేస్తా..' - 'సర్పంచులు గల్లీల్లో గల్లలెగరేసుకుని తిరిగేలా చేస్తా..'

Bandi sanjay Comments: జాతీయ పంచాయతీరాజ్ దివాస్ సందర్భంగా పాదయాత్రలో భాగంగా.. నారాయణపేట జిల్లా నర్వలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో బండి సంజయ్​ సమావేశమయ్యారు. కొత్తచట్టం పేరుతో సర్పంచులకు అధికారాలే లేకుండా చేశారని తెరాస ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంపీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని, జడ్పీటీసీలంటే ఎవరో తెలియకుండా చేశారని మండిపడ్డారు.

bjp state president bandi sanjay comments on trs government
bjp state president bandi sanjay comments on trs government

By

Published : Apr 24, 2022, 3:51 PM IST

Bandi sanjay Comments: భాజపా అధికారంలోకి వస్తే సర్పంచులు గ్రామాల్లో గల్ల ఎగరేసుకుని గౌరవంగా తిరిగేలా చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దివాస్ సందర్భంగా పాదయాత్రలో భాగంగా.. నారాయణపేట జిల్లా నర్వలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో సమావేశమయ్యారు. సర్పంచులు తమ నియంత్రణలో ఉండాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ కొత్త పంచాయతీ రాజ్ చట్టానికి రూపకల్పన చేశారని ఆరోపించారు. కొత్తచట్టం పేరుతో సర్పంచులకు అధికారాలే లేకుండా చేశారని విమర్శించారు. ఎంపీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని, జడ్పీటీసీలంటే ఎవరో తెలియకుండా చేశారని మండిపడ్డారు.

"వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు ప్రజాప్రతినిధులందరికీ గౌరవం కల్పించేలా భాజపా సర్కారు వ్యవహరిస్తుంది. ఏకగ్రీవంగా గెలిచిన సర్పంచులకు తెరాస ప్రభుత్వం ఇప్పటికీ 5 లక్షలు ఇవ్వలేదు. అనర్హత వేటు వేస్తామంటూ సర్పంచులను అధికారులతో వేధింపులకు గురి చేస్తున్నారు. భాజపా అధికారంలోకి రావాలని తెరాస సర్పంచులు కూడా కోరుకుంటున్నారు. గ్రామాల్లో గ్రామ ప్రభుత్వం, మండల, జిల్లా స్థాయిలో ఆ స్థాయి ప్రభుత్వాలుండాలి. పంచాయతీల్లో జరిగే అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయి. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా ఐదేళ్లలో ప్రతి గ్రామపంచాయతీకి సగటున కోటి రూపాయలిచ్చిన ఘనత మోదీదే. రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మళ్లిస్తున్నాయన్న ఆరోపణలతో.. నేరుగా పంచాయతీలకే నిధులు చేరేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని నిధులిచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి." - బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షులు

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details