తెలంగాణ

telangana

ETV Bharat / state

'పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలి' - నారాయణపేటలో భాజపా ఆందోళన

నారాయణపేట జిల్లా కేంద్రంలో భారీ వర్షంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భాజపా నేతలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని కోరారు.

bjp protest in narayanapeta district
నారాయణపేటలో భాజపా ధర్నా

By

Published : Oct 24, 2020, 10:21 AM IST

నారాయణపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద భాజపా నేతలు ఆందోళనకు దిగారు. భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అకాల వర్షంతో జిల్లాలో పత్తి, కంది పంటలు వేసిన రైతులు.. పంటంతా నీటమునిగి నష్టపోయారని తెలిపారు.

వరిలో సన్నరకాలను ఎక్కువ మోతాదులో వేసిన రైతులు దారుణంగా నష్టపోయారని ఆవేదన చెందారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు పరిహారం అందించాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details