భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని భాజపా రాష్ట్ర నేత కొండయ్య డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో కాషాయ శ్రేణులతో కలిసి ధర్నాకు దిగారు. మిగిలిన పంటలకైనా మద్దతు ధర ప్రకటించాలని కోరారు.
భాగ్యనగర వాసులకే సాయం చేస్తారా.. రైతులను పట్టించుకోరా?
అకాల వర్షానికి నీట మునిగిన పంటకు పరిహారం చెల్లించాలని భాజపా డిమాండ్ చేసింది. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
నారాయణపేటలో భాజపా నేతల ధర్నా
హైదరాబాద్లో ఎన్నికలున్నందున వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేశారని, రైతులను మాత్రం గాలికి వదిలేశారని మండిపడ్డారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు కర్ని స్వామి, ఎంపీటీసీ బల్ రాంరెడ్డి, సర్పంచులు లక్ష్మణ్, చేపలి నర్సింహులు, గడ్డం రమేశ్, బాల్చేడ్ మల్లికార్జున్, ఈసరి నాగప్ప పాల్గొన్నారు.
- ఇదీ చదవండి :దారుణం: తల్లిని చంపాడు.. తల, మొండెం వేరుచేశాడు