ఊట్కూరు మండలం ఎర్గట్పల్లిలో బాలికను అత్యాచారం చేసి, ఆమె మృతికి కారణమైన యువకుడిని శిక్షించాలని నారాయణపేట జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ ఘటనలో పంచాయితీ చేసిన పెద్దలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
నారాయణపేటలో భాజపా మహిళ మోర్చా ధర్నా - mahila morcha latest news
నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భాజపా మహిళా మోర్చా ధర్నా నిర్వహించింది. ఊట్కూరు మండలం ఎర్గట్పల్లిలో బాలికను అత్యాచారం చేసి, ఆమె మృతికి కారణమైన యువకుడిని శిక్షించాలని జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ విషయమై పంచాయితీ చేసిన పెద్దలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
నారాయణపేటలో భాజాపా మహిళ మోర్చా ధర్నా
రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న దుండగులను శిక్షించాలని కోరారు. ఆడవారికి భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.