నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో భాజపా ఆధ్వర్యంలో భారత సరిహద్దులో చైనా దురాక్రమణకు నిరసనగా చైనా అధ్యక్షుడి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సరిహద్దులో అంగుళం భూమి సైతం వదిలే ప్రసక్తి లేదని, వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు మౌనం పాటించి నివాళులర్పించారు.
మక్తల్లో చైనా అధ్యక్షుని దిష్టిబొమ్మ దగ్ధం.. అమర జవాన్లకు నివాళి
భారత సరిహద్దు ప్రాంతంలో జరిగిన చైనా దాడుల నిరసనగా నారాయణపేట జిల్లా మక్తల్లో చైనా అధ్యక్షుడి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అమరులైన వీర జవాన్లకు భాజపా నాయకులు నివాళులర్పించారు.
మక్తల్లో చైనా అధ్యక్షుని దిష్టిబొమ్మ దగ్ధం
భారతదేశం శాంతికి చిహ్నమని, అదే సమయంలో కయ్యానికి ముందుగా కాలు దువ్వితే తగినరీతిలో సమాధానమిస్తుందని భాజపా రాష్ట్ర నాయకులు కొండయ్య పేర్కొన్నారు.