తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపు నారాయణపేటకు వెళ్లనున్న బండి సంజయ్​ - Bandi Sanjay tomorrow visit narayanpet

భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ రేపు(ఆదివారం) నారాయణపేటకు వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఆ చట్టాలతో నష్టం లేదని రైతులకు వివరించనున్నారు.

bandi-sanjay-tomorrow-going-to-narayanpet
రేపు నారాయణపేటకు వెళ్లనున్న బండి సంజయ్​

By

Published : Dec 19, 2020, 5:50 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించేందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ రేపు(ఆదివారం) నారాయణపేటకు వెళ్లనున్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులకు నష్టం కలిగించే అంశం లేదని... రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకే ఆ చట్టాలను తీసుకువచ్చినట్లు వివరించనున్నారు. అనంతరం ఓ ప్రైవేటు ఆసుపత్రిని ప్రారంభిస్తారని పార్టీ నేతలు తెలిపారు.

ఈ నెల 21, 22న కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్న బండి సంజయ్.. సోమవారం సిరిసిల్ల జిల్లాలో జరిగే దిశ కార్యక్రమంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. మంగళవారం కరీంనగర్​లో జరిగే దిశ కార్యక్రమంతో పాటు స్థానికంగా జరిగే పార్టీ సమావేశాలకు హాజరుకానున్నారు.

ఇదీ చూడండి :దొంగ రిజిస్ట్రేషన్లకు ధరణి స్వర్గధామం: మురళీధర్​ రావు

ABOUT THE AUTHOR

...view details