నారాయణపేట జిల్లా కలెక్టరేట్లో శనివారం హైదరాబాద్ వారి 'బ్రింగ్ ఏ స్మైల్' స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సమావేశం జరిపారు. జిల్లా కలెక్టర్ హరి చందన ముఖ్య అతిథిగా హాజరై ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లకు బ్యాగులను అందజేశారు. జిల్లాలో ఉండే మహిళా సంఘాల ద్వారా ఆ బ్యాగులను తయారు చేయించారని కలెక్టర్ అన్నారు. ఆ బ్యాగులను తయారు చేయడం ద్వారా మహిళలకు ఉపాధి దక్కిందని తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ వారిని కలెక్టర్ అభినందించారు.
'మహిళా సంఘాలతో బ్యాగుల తయారీ అభినందనీయం' - ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లకు బ్యాగుల పంపిణీ
నారాయణపేట జిల్లాలో ఉండే ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లకు జిల్లా కలెక్టర్ హరి చందన బ్యాగులను పంపిణీ చేశారు. శనివారం కలెక్టరేట్లో హైదరాబాద్ వారి 'బ్రింగ్ ఏ స్మైల్' స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

'మహిళా సంఘాలతో బ్యాగుల తయారీ అభినందనీయం'
ఆశా వర్కర్లు బైటకు వెళ్లేటపుడు అవసరమైన వస్తువులను వెంట తీసుకెళ్లుటకు బ్యాగులు ఉపయోగపడతాయని స్వచ్ఛంద సంస్థ నిర్వహకురాలు ప్రీతీ తెలిపారు. మహిళలకు రుతుక్రమ సమయంలో ఇబ్బందులు ఏర్పడకుండా "మెన్స్ట్రువల్ కప్స్" కూడా తయారు చేసి పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మహిళలు అందరూ వాటిని వాడవచ్చని, వాటి ఉపయోగాలపై ఆశా వర్కర్లకు తెలియజేశారు. సమావేశంలో డీ ఆర్డీఓ కాళిందిని, బ్రింగ్ ఏ స్మైల్ సభ్యులు కవితారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :మద్యం మత్తులో భార్యాభర్తలపై దాడి చేసిన అల్లరిమూకలు