Anjali select as BSF for First Woman in Narayanapeta : పేదింటి విద్యా కుసుమం అంజలి.. ఏనాడూ వెనకడుగు వేయలేదు. ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబమైనా కష్టపడి చదివి తన లక్ష్యాన్ని చేరుకుంది. నారాయణపేట జిల్లా నుంచి మొదటిసారిగా బీఎస్ఎఫ్ జవాన్‌గా.. ఎంపికైన మహిళగా పేరు సంపాదించింది అంజలి. నారాయణపేట జిల్లా కేంద్రంలోని బాహార్పేట్ వీధిలో నివసించే మల్లమ్మ, బలాప్పలకు ముగ్గురు కూతుళ్లు. వారికి కుమారులు లేరు. బలాప్ప తాపీమేస్త్రీగా పనిచేయగా, మల్లమ్మ అంగన్వాడీ ఆయగా విధులు నిర్వహిస్తోంది.
ముగ్గురు అమ్మాయిలను డిగ్రీ వరకు చదివించాడు బలాప్ప. ఇద్దరు పెద్ద అమ్మాయిలకు పెళ్లిళ్లు చేశారు. చిన్న అమ్మాయి అంజలి.. పోలీస్ లేదా ఆర్మీలో చేరాలని చిన్నప్పటి నుంచి కలలు కనేది. డిగ్రీ పూర్తయిన తర్వాత కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడంతో.. పరీక్షలకు సన్నద్ధం అవుతానని తెలపడంతో తలిదండ్రులు ప్రోత్సహించారు. పోలీస్ కానిస్టేబుల్‌కు సిద్దం అయ్యే సమయంలో.. జిల్లా కేంద్రంలో ఆర్మీ జవాన్ ఆంజనేయులు ఉచితంగా ఆర్మీకి శిక్షణ ఇస్తున్నారని స్నేహితుల ద్వారా తెలుసుకుని శిక్షణలో చేరింది.
Narayanapeta Latest News :కేంద్ర బలగాల్లో అవకాశం వేస్తే చేరాలనుకుని నిర్ణయించుకుంది. ఆ దిశగా ముమ్మరంగా కసరత్తు చేసింది.బీఎస్ఎఫ్కు నిర్వహించే అన్ని పరీక్షల్లో ప్రతిభ కనబరిచింది. బీఎస్ఎఫ్ జవాన్‌గా ఉద్యోగం సంపాదించింది. నేటి సమాజంలో అమ్మాయిని కేంద్ర బలగాలకు ఎందుకు పంపించాలి అని.. నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడే వారుంటారు. మా అమ్మ నాన్న మాత్రం.. నువ్వు అనుకున్నది సాధించు.. మేము నీకు అండగా ఉంటామని ప్రోత్సహించారని అంజలి పేర్కొంది. బీఎస్ఎఫ్ జవాన్‌గా ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా.. తాను వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.