తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆదరించాల్సిన లోకం మతిలేని ఆమెతో ఆడుకుంది' - Narayanpet District Latest News

అమ్మానాన్న మృతి చెందారు.. అండగా నిలవాల్సిన తోడబుట్టిన అన్న తనదారి తను చూసుకున్నాడు. ఆసరా లేని స్థితిలో మహిళ మతిస్థిమితం కోల్పోయింది. బిచ్చమెత్తుతూ రోడ్లపైనే సంచరించేది. దీనస్థితిలో ఉన్న ఆమెను ఆదుకోవాల్సిన సమాజం వక్రబుద్ధి చూపింది. కొందరు మృగాళ్లు లైంగికదాడి చేయడంతో ఆ అభాగ్యురాలు ఇప్పటికి ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది.

'ఆదరించాల్సిన లోకం మతిలేని ఆమెతో ఆడుకుంది'
'ఆదరించాల్సిన లోకం మతిలేని ఆమెతో ఆడుకుంది'

By

Published : Mar 8, 2021, 8:45 AM IST

Updated : Mar 8, 2021, 8:43 PM IST

నారాయణపేట జిల్లాలోని కోస్గి పట్టణానికి చెందిన మతిస్థిమితం కోల్పోయిన ఓ మహిళ ఆదివారం మూడోబిడ్డను ప్రసవించింది. బస్టాండ్‌ దగ్గర పెట్రోల్‌బంకు వెనుక నిర్మాణంలో ఉన్న భవనంలో ఆమెకు నొప్పులు రావడంతో స్థానికులు ప్రభుత్వ వైద్యురాలిని రప్పించి ప్రసవం చేయించారు. ఆ అభాగ్యురాలు ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

వెంటనే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని శిశుగృహానికి పసికందును అంగన్‌వాడీ సిబ్బంది అప్పగించారు. ఇంతకు ముందు పుట్టిన ఇద్దరు బిడ్డలనూ సంరక్షణకు ఇలాగే పంపారు. బాధిత మహిళకు అధికారులు ఇప్పటికైనా రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇంత జరుగుతున్నా.. అధికారులు చోద్యం చూస్తున్నారు. నిందితులెవరో గుర్తించే ప్రయత్నం చేయలేదు. బాధితురాలిని ఆదుకోనూలేదు.

శిశుగృహానికి పసికందు అప్పగింత

ఇదీ చూడండి:విమెన్స్ డే స్పెషల్: నీ సహనానికి సరిహద్దులు కలవా..!

Last Updated : Mar 8, 2021, 8:43 PM IST

ABOUT THE AUTHOR

...view details