ఎల్ఆర్ఎస్ రద్దును డిమాండ్ చేస్తూ..నారాయణపేట జిల్లా మక్తల్లో అఖిలపక్ష నాయకులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయ భూములకు పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు కల్పిస్తూ.. ప్రభుత్వం జీవోలు జారీ చేసేంతవరకూ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
'ప్రభుత్వ జీవోలు జారీ అయ్యేవరకు పోరాటం ఆగదు' - ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా
నారాయణ పేట జిల్లా మక్తల్లో అఖిలపక్ష నేతలు ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

'ప్రభుత్వ జీవోలు జారీ అయ్యేంతవరకూ పోరాటం ఆగదు'
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పీసీసీ సభ్యులు ఆశిరెడ్డి, భాజపా నాయకులు స్వామి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మధుసుధన్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి కొండన్న తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'ఎల్ఆర్ఎస్ రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తాం'