తెలంగాణ

telangana

ETV Bharat / state

బాటసారులకు ఆసరా- లయన్స్ క్లబ్ చల్లని మజ్జిగ - FREE DISTRIBUTION OF LASSI, COOL WATER

లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్​-భీమా ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ, తాగునీరు ఉచితంగా పంపిణీ చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని దాహం తీరుస్తున్నారు. ఈ కార్యక్రమం పట్ల స్థానిక ప్రజలు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

పరీక్ష రాసి వస్తూ పెద్ద సంఖ్యలో మజ్జిగ తీసుకున్న పదో తరగతి విద్యార్థులు

By

Published : Mar 29, 2019, 7:24 PM IST

లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్​-భీమా ఆధ్వర్యంలో ఉచితంగా మజ్జిగ, తాగునీరు పంపిణీ
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్​-భీమా ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ, తాగునీరు ఉచితంగా పంపిణీ చేశారు. మధ్యాహ్నం సమయంలో పదో తరగతి విద్యార్థులు పరీక్ష ముగించుకుని వస్తూ... పెద్ద సంఖ్యలో చల్లని మజ్జిగ తీసుకున్నారు. క్లబ్ నిర్వాహకులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో క్లబ్ జోన్ ఛైర్మన్ అనుగొండ శ్రీనివాసులు, అధ్యక్షులు కర్నె స్వామి, నాగిరెడ్డి, అంజన్ ప్రసాద్, జైపాల్ రెడ్డితదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details