నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన మరిన్ బీ కథ వింటే... కన్నీటికి కూడా కనికరం కలగకమానదు. ఒకటా రెండా కష్టాలకు ఎంతో ఇష్టమైనట్టు ఒకదానివెనుకొకటి ఆమె కుటుంబాన్ని అడుగడుగునా కుంగదీశాయి. కటిక గెరికి చెందిన మరిన్ బీ భర్త హుస్సేన్ 20 ఏళ్ల కిందట కామెర్ల వ్యాధితో మృతి చెందాడు. అప్పటి నుంచి ముగ్గురు కుమార్తెలను రెక్కల కష్టంతోనే పెంచుతోంది. రెండో కుమార్తెతో కలిసి మాంసం దుకాణంలోని మేక తలకాయలు తీసుకొచ్చి కాల్చి... ఆ కూలితోనే ఆ కుటుంబం బతుకుతోంది.
పెద్ద కుమార్తె ఆశా బీకి పెళ్లి చేయగా... ఆమె భర్త గుండెజబ్బుతో మృతిచెందడం వల్ల ఇద్దరు పిల్లలతో ఆమె పుట్టింటికి వచ్చింది. 2008లో రెండో కుమార్తెకు రాయచూర్‌కు చెందిన వ్యక్తికిచ్చి వివాహం చేయగా... అతనికి మతిస్థిమితం లేకపోవడం వల్ల ఆమె పుట్టింటికి వచ్చేసింది. ఇక పెళ్లీడుకొచ్చిన మూడో కుమార్తె షాబిదా బేగం ఐదేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయింది. ఆమెకు వైద్యం చేయించినా నయం కాలేదు.
అదే వారి జీవనాధారం