నారాయణపేట జిల్లా ఉట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు కలకలం సృష్టించాయి. తిప్రస్ పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసు ముదిరాజ్ ఇంట్లో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నట్లు సమాచారం అందింది.
నారాయణపేట జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం - నకిలీ విత్తనాల విలువ రూ. 57,660: ఎస్సై రషీద్
రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు దాడులు చేస్తున్నా.. నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడుతూనే ఉన్నాయి. నారాయణపేట జిల్లా తిప్రస్ పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసు ఇంట్లో.. 56 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
![నారాయణపేట జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం 56 packets of fake cotton seeds in the house of Srinivasu of Tipras Palli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7464329-395-7464329-1591201654946.jpg)
'నారాయణపేట జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం'
వెంటనే రెండు బృందాలుగా విడిపోయిన పోలీసులు దాడులు నిర్వహించారు. దాదాపు 56 ప్యాకెట్లు నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వాటి విలువ సుమారు రూ. 57,660 ఉంటుందని ఎస్సై రషీద్ తెలిపారు.