నారాయణపేట జిల్లా పరిధిలో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. వేసవి కాలం దృష్ట్యా ఉదయాన్నే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. రాజ్యాంగం కల్పించిన తమ హక్కును వినియోగించుకునేందుకు వృద్ధులు, మహిళలు, యువతీయువకులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు - ELECTIONS
మధ్యాహ్న వేళ ఎండ వేడిమి ఎక్కువగా ఉంటున్నందున ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
Last Updated : May 14, 2019, 12:27 PM IST