తెలంగాణ

telangana

By

Published : Jan 6, 2021, 2:29 PM IST

ETV Bharat / state

పెట్రోల్​ బంకు సిబ్బంది గాఢ నిద్ర... 1,200 లీటర్ల డీజిల్ తస్కరణ

నారాయణపేట జిల్లాలో డీజిల్ ఇంధనం దొంగతనాలు మామూలైపోయాయి. ప్రధాన రహదారుల వెంట రాత్రి సమయాల్లో నిలిచి ఉన్న లారీల్లో, సిబ్బంది నిద్రిస్తున్న సమయంలో బంకులలో ఇంధనాన్ని పక్కా ప్రణాళికతో దొంగలిస్తున్నారు. ఇతర వాహన యజమానులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇలాంటి ఘటన తెల్లవారుజామున కృష్ణ మండలంలోని టైరోడ్​లో చోటు చేసుకుంది.

బంకు సిబ్బంది గాఢ నిద్ర... 1,200 లీటర్ల డీజిల్ తస్కరణ
బంకు సిబ్బంది గాఢ నిద్ర... 1,200 లీటర్ల డీజిల్ తస్కరణ

నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలో తెల్లవారుజామున హెచ్​పీ పెట్రోల్ బంకు నుంచి దొంగలు 1,200 లీటర్ల డీజిల్​ను తస్కరించారు. సమీపంలో ఉన్న మూతపడిన భారత్ పెట్రోల్ బంకును అడ్డాగా మార్చుకున్న దుండగులు... బంకు సిబ్బంది గాఢనిద్రలో ఉన్న సమయంలో డీజిల్ ట్యాంక్ వెనకభాగంలో మూతను బద్దలుకొట్టి ఇంధనాన్ని దొంగిలించారు.

వాహనాల్లో దొంగిలించిన డీజిల్​ను తీసుకెళ్లినట్లు సిబ్బంది తెలిపారు. దుండగులు పారిపోతూ పాత పెట్రోల్​ బంకు యంత్రాన్ని ఢీకొట్టి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇలాంటి దొంగతనాలు మక్తల్, మరికల్, దేవరకద్ర పరిసర ప్రాంతాలలో తరచుగా జరుగుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు.

ఇదీ చదవండి:గర్భవతి అని చూడకుండా కోడలిని హింసించిన అత్త!

ABOUT THE AUTHOR

...view details