నారాయణపేట జిల్లా నర్వ మండలం రాయికోడ్ గ్రామానికి చెందిన ప్రణీత.. ఈ నెల 19న సాయంత్రం పల్లీలు తినగా.. ప్రమాదవశాత్తు.. పాప గొంతులో ఇరుక్కున్నాయి. ఒక గింజ ఊపిరితిత్తుల్లోకి వెళ్లగా వెంటనే హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు.
గొంతులో పల్లీ ఇరుక్కుని పదకొండు నెలల చిన్నారి మృతి
వేరుశనగ గింజ గొంతులో ఇరుక్కుని పదకొండు నెలల బాలిక మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా నర్వ మండలం రాయికోడ్ గ్రామంలో జరిగింది. నాలుగు రోజుల క్రితం ఘటన జరగగా హైదరాబాద్ నిలోఫర్లో చికిత్స పొందుతున్న చిన్నారి గురువారం చనిపోయింది.
గొంతులో పల్లీ ఇరుక్కుని పదకొండు నెలల చిన్నారి మృతి
అయితే గురువారం మధ్యాహ్నం.. చిన్నారి మరణించినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఘటనపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: 'రైతుల తర్వాత ఈసారి కార్మికులపై దోపిడి'