నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో విషాదం చోటుచేసుకుంది. ఉదయమే ఉపాధి హామీ పనులకొచ్చి అనంతలోకాలకు వెళ్లిపోయారు. పనిచేస్తుండగా ఒక్కసారిగా మట్టి దిబ్బ కూలడంతో 10 మంది కూలీలు మృతి చెందారు. మట్టిదిబ్బ తవ్వుకుంటూ ఒక గ్రూపుగా ఉన్న 12 మంది లోపలికి వెళ్లారు. పైనుంచి మట్టి దిబ్బ కూలడంతో 10 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
కేసీఆర్ దిగ్భ్రాంతి