'ఇక నుంచి అన్ని కాగిత రహిత కార్యకలాపాలే' - కాగితపు రహిత కార్యకలాపాలు
కాగితపు రహిత కార్యకలాపాలు కొనసాగేవిధంగా ఈ కార్యాలయాలను రూపొందించినట్లు నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు పేర్కొన్నారు.
'ఇక నుంచి అన్ని కాగిత రహిత కార్యకలాపాలే'
నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవో కార్యాలయానికి సంబంధించి 11 మండలాల ఈ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ వెంకట్రావు ప్రారంభించారు. జిల్లాకు సంబంధించిన అన్ని ప్రభుత్వ కార్యాకలపాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కార్యకలాపాలన్ని కాగితపు రహితంగా కొనసాగుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.