పేదలకు కూరగాయల పంపిణీ - ZPTC Member Swarupa Vegetables Distribution for poor peoples
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు దాతలు ఆపన్నహస్తం అందిస్తున్నారు. నల్గొండ జిల్లా సానబండ గ్రామంలోని 400 మంది పేదలకు జడ్పీటీసీ సభ్యురాలు కూరగాయలను పంపిణీ చేశారు.
పేదలకు కూరగాయల పంపిణీ
నల్గొండ జిల్లా మునుగోడు పరిధిలోని సానబండ గ్రామంలో జడ్పీటీసీ సభ్యురాలు నారబోయిన స్వరూప 400 మంది పేదప్రజలకు కూరగాయలను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద వారిని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.
TAGGED:
పేదలకు కూరగాయల పంపిణీ