తెలంగాణ

telangana

ETV Bharat / state

ys Sharmila: 'ఖాళీగా ఉన్న ఉద్యోగాలను.. భర్తీ చేయలేని దురవస్థ నెలకొంది' - ysrtp president

తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన విద్యార్థులు, యువకులకు... కేసీఆర్ పాలనలో తీరని అన్యాయం జరిగిందని వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు (YS SHARMILA PROTEST). సీఎం కేసీఆర్​ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయని... రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా వాటిని భర్తీ చేయలేని దురవస్థ నెలకొందని నల్గొండ దీక్షా వేదికగా విమర్శించారు.

sharmila
sharmila

By

Published : Oct 13, 2021, 4:31 AM IST

ఉద్యోగ ప్రకటనలు లేక, తల్లిదండ్రులకు భారం కాలేక యువత ప్రాణాలు తీసుకుంటోందని... వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు (YS SHARMILA PROTEST). ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా... కేసీఆర్​కు చీమకుట్టినట్లయినా లేదని విమర్శించారు. ప్రతి మంగళవారం నిర్వహించే నిరుద్యోగ నిరాహారదీక్షలో (ys sharmila hunger strike) భాగంగా షర్మిల... నల్గొండలో పర్యటించారు. క్లాక్​టవర్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై సాయంత్రం వరకు దీక్షకు కూర్చున్నారు (ys Sharmila dheeksha). వైఎస్ హయాంలో... అయిదేళ్ల కాలంలోనే మూడు ఉద్యోగ ప్రకటనలు వచ్చాయని షర్మిల గుర్తుచేశారు.

నిర్లక్ష్య నీడలో...

నల్గొండ చేరుకునే క్రమంలో షర్మిల... మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం వద్ద ఆగి... కాసేపు మాట్లాడారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతున్నాయని విమర్శించారు. వీసీలు, ఇతర సిబ్బంది నియామకాలు లేక చదువులు సాగే పరిస్థితి లేకుండా పోయిందని మండిపడ్డారు.

నల్గొండ జిల్లా కేంద్రంలో దీక్ష చేస్తున్న వైఎస్​ షర్మిల

ఆ భయంతోనే...

హుజూరాబాద్​లో ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్... అన్ని వ్యవస్థల్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారని షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ఇదీ చూడండి:YS SHARMILA PROTEST: వైఎస్ పేరెత్తే అర్హత కేసీఆర్​కు లేదు: షర్మిల

ABOUT THE AUTHOR

...view details