నాగార్జునసాగర్ ఉప ఎన్నిక బరిలో ఉన్న 41 మంది అభ్యర్థుల్లో 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కుల వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి 74 ఏళ్లతో అందరి కంటే వయసులో పెద్దాయనగా రికార్డులో ఉన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కలిపి ఇప్పటివరకు 17 సార్లు పోటీ చేసిన సూర్యాపేట వాసి మర్రి నెహేమియాకు 70 ఏళ్లున్నాయి.
సాగర్ ఉపఎన్నిక బరిపై.. యువత గురి
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న 41 మందిలో ఎక్కువ మంది యువతే ఉన్నారు. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కుల వారే ఎక్కువగా ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అందరి కంటే వయసులో పెద్దాయనగా రికార్డులో ఉన్నారు.
నాగార్జునసాగర్, నాగార్జునసాగర్ ఉపఎన్నిక
బరిలో నిలిచిన అభ్యర్థుల్లో పోతుగంటి కాశయ్య (ఎంసీపీఐ)కు అత్యల్పంగా 26 ఏళ్లు ఉన్నాయి. ప్రధాన పార్టీల్లో తెరాస అభ్యర్థి నోముల భగత్ వయస్సు 36, భాజపా అభ్యర్థి పానుగోతు రవికుమార్‌కు 36, తేదేపా అభ్యర్థి మువ్వా అరుణ్‌కుమార్‌కు 58 ఏళ్లున్నాయి. బరిలో ఉన్న అభ్యర్థుల్లో 20 మంది సాగర్ కాకుండా ఇతర నియోజకవర్గాలకు చెందిన వారు ఉండడం గమనార్హం.
- ఇదీ చదవండి :'హామీలను నెరవేర్చటంలో తెరాస ప్రభుత్వం విఫలం'