తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగర్ కాల్వలో దూకిన యువతి.. రక్షించిన యువకులు - woman jumped into sagar canal

తల్లిదండ్రులు మందలించారని ఓ యువతి నల్గొండ జిల్లా హాలియాలోని సాగర్​ కాల్వలో దూకింది. వెంటనే ఓ యువకుడు నీటిలోకి దూకి యువతిని ఒడ్డుకు తీసుకురాగా... పలువురు యువకులు రక్షించి బయటకు తీసుకొచ్చారు.

Young men rescue a young woman who jumped into a canal in nalgonda district
కాల్వలో దూకిన యువతిని రక్షించిన యువకులు

By

Published : Jul 15, 2020, 7:59 PM IST

నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియాలోని సాగర్ కాల్వలో.. అనుముల గ్రామానికి చెందిన సంధ్య అనే యువతి దూకింది. ఇంట్లో తల్లిదండ్రులు మందలించడం వల్ల సదరు యువతి హాలియా పీఎస్​ సమీపంలో ఉన్న సాగర్ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చి దూకినట్లు ఆమె బంధువులు తెలిపారు.

సంధ్య కాల్వలో దూకిన సమయంలో అక్కడే ఉన్న యువకుడు నీటిలోకి దూకి యువతిని ఒడ్డుకు తీసుకొచ్చాడు. పలువురు యువకులు చేతులు పట్టుకుని యువతిని రక్షించి బయటకు తీసుకువచ్చారు. అమ్మాయిని కాపాడిన యువకులను అక్కడ ఉన్న వారు అభినందించారు.

ఇవీ చూడండి: నీళ్లల్లో పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details