మరి కొద్దిసేపట్లో వివాహ ముహుర్తం నిర్ణయించి.. పెళ్లిపత్రిక రాసేవారు. కానీ.. విధి ఆ యువకుడి భవిష్యత్తుతో ఆటాడుకుంది. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బొర్రాయిపాలెంకు చెందిన మొండికత్తి ఏసుకు వివాహ సంబంధం కుదిరింది. వివాహ ముహూర్తం నిర్ణయించి లగ్న పత్రిక రాసేందుకు బంధువులతో కలిసి అమ్మాయి ఇంటికి బయలుదేరారు. బంధువులంతా ఆటోలో ముందు వెళ్తుండగా.. ఏసు తన బావ ద్విచక్రవాహనం మీద ఆటో వెనకాల బయల్దేరాడు. జిల్లాలోని నిడమనూరు మండలం బక్కమంతులపాడు వద్దకు రాగానే.. బైకును వెనక నుంచి లారీ ఢీకొట్టింది. తలకు బలమైన గాయం తగలడం వల్ల ఏసు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. యువకుడు చనిపోయాడని సమాచారం అందుకున్న బంధువులు వెనక్కి వచ్చి మృతదేహం వద్ద గుండెలు బాదుకుంటూ ఏడ్చిన దృశ్యం అక్కడి వారిని కన్నీరు పెట్టించింది. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
లగ్గం పెట్టుకునేందుకు వెళ్తూ.. యువకుడు మృతి - నల్గొండ జిల్లా వార్తలు
మరికొద్దిసేపట్లో పెళ్లి పత్రిక రాసేవారు. మరి కొన్నిరోజుల్లో పసుపు బట్టలతో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వాడు.. కానీ.. విధి వక్రించింది. మృత్యువు లారీ రూపంలో వచ్చి ఆ యువకుడి ప్రాణాలు బలి తీసుకుంది. లారీ ఢీకొట్టడం వల్ల యువకుడు మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది.
లగ్గం పెట్టుకునేదుకు వెళ్తూ.. యువకుడు మృతి