నల్గొండ జిల్లా చండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన గడ్డం శ్రీకాంత్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫైనాన్స్‌లో ఆటో తీసుకుని... జీవనాన్ని సాగిస్తున్న అతనికి కరోనా పెద్ద నష్టాన్నే మిగిల్చింది.
కొవిడ్ కాటు: ఫైనాన్స్ వేధింపులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య - ఒత్తిడితో యువకుడి ఆత్మహత్య
''పెద్దగా చదువుకోలేదు. కానీ తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలనే ఆలోచన. సరే వచ్చిన పనే చేసుకుందాం అనుకున్నాడు. ఫైనాన్స్‌లో ఆటో తీసుకున్నాడు.'' ప్రతినెలా ఫైనాన్స్ చెల్లించేవాడు. ఇంతలోనే కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. ఆ వైరస్‌తోనే అతని ఆశలు అడియాసయ్యాయి. ఫైనాన్స్ వేధింపులు పెరిగాయి. సమయం కావాలని వేడుకున్నా కనికరించకపోవడంతో చివరికి తనువుచాలించాడు ఓ యువకుడు.
ఈ ఒత్తిడి నేను భరించలేనంటూ యువకుడి ఆత్మహత్య
కరోనా నేపథ్యంలో కిరాయిలు లేక నష్టపోతున్న అతనికి... ఫైనాన్స్ కంపెనీ నుంచి ఒత్తిడి ఎక్కువైపోయింది. ఇక చేసేదేమీ లేక... ఒత్తిడితోనే తనువు చాలిస్తున్నానంటూ సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. తల్లిదండ్రులు ఫైనాన్స్ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి:టిక్‌టాక్ ఫీచర్లతో ఇన్స్టాగ్రామ్ 'రీల్స్'