దేశవ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ముందుకు తీసుకుపోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ ఆకాంక్షించారు. ఎంపీ సంతోశ్ కుమార్ విసిరిన ఛాలెంజ్‌ను ఆయన పూర్తి చేశారు. తన జన్మదినం సందర్భంగా నల్గొండ జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు.
గ్రీన్ ఛాలెంజ్ దేశవ్యాప్తంగా విస్తరించాలి: జాజల సురేందర్ - గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్
ఎంపీ సంతోశ్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ మొక్కలు నాటారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే సురేందర్
రాష్ట్రంలో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో అద్భుతంగా కొనసాగుతోందని అన్నారు. పౌరులందరూ బాధ్యతగా మొక్కలు నాటి.. వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే సురేందర్ సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సర్పంచ్ శ్రావణ్ రెడ్డి, ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి, ఉపసర్పంచ్ అంజయ్యలు పాల్గొని మొక్కలు నాటాలని కోరారు.