నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తనను వేధింపులకు గురిచేస్తున్నారని నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం యల్లమ్మగూడెం గ్రామ సర్పంచ్ గాదె సంధ్య ఆరోపించారు. అందుకు నిరసనగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ లేఖను సోమవారం రోజు కలెక్టర్‌కు అందజేసేందుకు రాగా ఆయన అందుబాటులో లేకపోవడంతో కలెక్టరేట్ ఏవో మోతీలాల్‌కు అందజేశారు.
MLA Harassment: మా ఎమ్మెల్యే వేధిస్తున్నారు.. కలెక్టర్‌ను ఆశ్రయించిన మహిళా సర్పంచి - Nalgonda district news
నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తనను వేధింపులకు గురిచేస్తున్నారని తిప్పర్తి మండలం యల్లమ్మగూడెం గ్రామ సర్పంచ్ ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తాను అధికార పార్టీలో చేరకపోవడంతో ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు దిగారని పేర్కొన్నారు. అందుకు నిరసనగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వ ఒత్తిడి, ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేకనే సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తాను అధికార పార్టీలో చేరకపోవడంతో ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు దిగారని ఆరోపించారు. రెండున్నరేళ్లుగా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకుండా అడ్డుకున్నారని తెలిపారు. గాదె సంధ్య ఆరోపణలను ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఖండించారు. గ్రామాభివృద్ధి పనులను సకాలంలో చేయడం చేతకాక.. తనపై సర్పంచ్ అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ys Sharmila: ఇవాళ నల్గొండలో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష