యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా.. ఆదివారం రాత్రి స్వామి, అమ్మవార్లను ప్రత్యేక అలంకారంలో ఊరేగించి కల్యాణ మండపంలో ఎదురెదురుగా అధిష్టింపజేసి ఎదుర్కోలు తంతును నిర్వహించారు. అనంతరం స్వామివారి తరఫున ఆలయ ఈవో గీతారెడ్డి, అమ్మవారి తరఫున ఆలయ ఛైర్మన్ నర్సింహమూర్తి పెళ్లి పెద్దలుగా వ్యవహారించారు. ఒప్పందాలు, చర్చల అనంతరం స్వామివారు మాకు నచ్చారని అమ్మవారి తరఫునవారు... అమ్మవారు మాకు కూడా నచ్చారని స్వామి తరఫున వారు అంగీకరించడంతో ఎదుర్కోలు మహోత్సవం ముగిసింది.
లక్ష్మీనరసింహుని కల్యాణమహోత్సవానికి ముహూర్తం - yaadadri temple
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఎదుర్కోలు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ శ్రీమతి అనితా రామచంద్రన్, ఆలయ ఈవో గీతారెడ్డి హాజరయ్యారు.
అనంతరం వేదపండితులు స్వామి, అమ్మవార్ల కల్యాణం కోసం మంచి ముహూర్తాన్ని నిర్ణయించారు. ఈ రోజు ఉదయం 11గంటలకు బాలాలయంలో తిరుకల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం జడ్పీహెచ్ఎస్లో రాత్రి అభిజిత్ లగ్నం జరగనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, ఆలయ ఈవో గీతారెడ్డి, ఛైర్మన్ నర్సింహమూర్తితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు, స్థానికులు హాజరయ్యారు.
ఇదీ చదవండి: పంటల బీమా సొమ్ము కోసం రైతుల నిరీక్షణ