నల్గొండ జిల్లా దామరచర్ల మండలం యాదాద్రి పవర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న వలస కూలీలను ఎట్టకేలకు హైదరాబాద్‌కు తరలించారు.యాదాద్రి పవర్ ప్లాంట్‌లో 1500 మంది వలస కూలీలు పనిచేస్తుండగా.. సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి ఇష్టపడే వారిని మొదటి విడతగా ఆరోగ్య పరీక్షలు చేసి 3 ప్రత్యేక బస్సుల్లో తరలించారు.
యాదాద్రి పవర్‌ప్లాంట్ వలస కూలీల మొదటి విడత తరలింపు - lock down update
లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయిన యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న వలస కూలీలను అధికారులు హైదారాబాద్‌కు తరలించారు. తరలింపులో భాగంగా 107 మందిని ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్‌కు పంపించారు. అక్కడి నుంచి రైలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
యాదాద్రి పవర్‌ప్లాంట్ వలస కూలీల మొదటి విడత తరలింపు
బిహార్‌కు చెందిన 40 మంది, జార్ఖండ్‌కు చెందిన 38 మంది, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 16 మంది, పశ్చిమ బంగాకు చెందిన 13 మంది కాగా మొత్త 107 మందిని హైదారబాద్‌కు పంపించారు. అక్కడి నుంచి రైల్లో వారి స్వస్థలాలకు పంపే ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు.