నల్గొండ జిల్లా చండూరు మండల విద్యార్థులు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో చోటు దక్కించుకున్నారు. చండూరులోని గాంధీజీ విద్యా సంస్థకు చెందిన 800 మంది విద్యార్థులు ఒకేసారి కరాటే, కుంగ్‌ఫూ, టైక్వాండో, జూడో, మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్ మొదలగు ఆటలల్లో ప్రావీణ్యం కనబర్చి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్నారు. ఈ కార్యక్రమానికి సినీ హీరో సుమన్ ముఖ్య అతిథిగా హాజరై పాఠశాల యాజమాన్యానికి రికార్డు ప్రశంస పత్రాన్ని అందజేశారు. కార్యక్రమానికి జిల్లా విద్యాధికారిణి సరోజినీ దేవి, స్థానిక జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, ఎంపీపీ పల్లె కళ్యాణి రవి పాల్గొన్నారు.
చండూరు విద్యార్థులకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు - చండూరు విద్యార్థులకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు
నల్గొండ జిల్లా చండూరు విద్యార్థులు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో చోటు దక్కించుకున్నారు. గాంధీజీ విద్యా సంస్థ 800 మంది విద్యార్థులు ఒకేసారి కరాటే, కుంగ్‌ఫూ, టైక్వాండో, జూడో, మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్ మొదలగు ఆటల్లో ప్రావీణ్యం కనబర్చారు.
చండూరు విద్యార్థులకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు