తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగార్జునసాగర్​ ఉపపోరులో మహిళా ఓటర్లే కీలకం

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో ఓటరు నిర్ణయం ఏ వైపు ఉండబోతోందన్న విషయంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే అధకంగా ఉండడంతో... వారిని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు ప్రణాళికలు చేస్తున్నాయి.

women-voters-are-crucial-in-nagarjuna-sagar-bypoll-election
మహిళా ఓటర్లే కీలకం

By

Published : Apr 5, 2021, 9:56 AM IST

నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో మొత్తం 2,19,745 ఓటర్లు ఉండగా అందులో 1,10,838 ఓటర్లు మహిళలు, 1,08,907 ఓటర్లు పురుషులు ఉన్నారు. అంటే పురుషుల కన్నా మహిళా ఓటర్లే 1931 మంది అధికంగా ఉన్నారన్నమాట. మహిళలను ప్రభావితం చేయగలిగే ఏ అభ్యర్థి అయినా గెలిచే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

త్రిపురారం మండలంలో 274 మంది మహిళా ఓటర్లు పురుషుల కన్నా అధికంగా ఉండగా, మాడ్గులపల్లిలో 49, నిడమనూరులో 274, అనుములలో 401, పెద్దవూరలో 722 మంది, గుర్రంపోడులో 88 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఒక్క తిరుమలగిరి మండలంలో మాత్రమే మహిళల కంటే పురుష ఓటర్లు 105 మంది ఎక్కువగా ఉన్నారు. గత ఎన్నికల్లో 2.06 లక్షలుగా ఉన్న ఓటర్ల సంఖ్య గత రెండేళ్లలో 14 వేలు పెరిగింది.

ఇదీ చూడండి:ట్రాఫిక్ పోలీసుల సరదా మీమ్.. నెట్టింట్లో తెగ వైరల్

ABOUT THE AUTHOR

...view details