నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండప్రోలు గ్రామంలో టంగుటూరి గీత అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. ఉరి వేసుకొని చనిపోయినట్లు కనిపించినా.. భర్తే ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా నమ్మించ చూస్తున్నాడంటూ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలు చనిపోవడానికి ఒకరోజు ముందు జానయ్య సోదరులతో కలిసి కల్లేపల్లి మైసమ్మ వద్ద దావత్ చేసుకున్నారు. అదే రోజు రాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. తెల్లారెసరికి గీత ఉరికి వేలాడుతూ కనిపించింది.
మహిళ అనుమానాస్పద మృతి.. భర్తపైనే అనుమానం! - అనుమానాస్పద మృతి
గృహిణి అనుమానాస్పదంగా మరణించిన ఘటన నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండప్రోలు గ్రామంలో చోటు చేసుకుంది. ఉరి వేసుకొని చనిపోయిన మహిళను గమనించిన ఆమె బంధువులు.. ఆమెది హత్యే అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో ఉంది.
మహిళ అనుమానాస్పద మృతి.. భర్తపైనే అనుమానం!
కుటుంబ తగాదాలతో గీత ఆత్మహత్య చేసుకుందని భర్త జానయ్య బంధువులందరికీ సమాచారం అందించాడు. అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తుండగా అనుమానించిన గీత సోదరులు గొంతు నులిమి హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడని వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిర్యాలగూడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
ఇదీ చదవండి:వారికి స్మార్ట్ఫోన్లే లేవ్- మరి ఆన్లైన్లో చదువెలా?
Last Updated : Jun 27, 2020, 11:08 AM IST