సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో.. నల్గొండ జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ పెద్దలుకు చేదు అనుభవం ఎదురైంది. అనుముల మండలం పాలెంలో ప్రచారానికి వెళ్లిన ఆయనను.. గ్రామ మహిళలు అడ్డకున్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు.. తమకేమి అందలేదంటూ వారు మండిపడ్డారు.
జడ్పీ వైస్ ఛైర్మన్ ప్రచారాన్ని అడ్డుకున్న మహిళలు - Women blocked election campaign
నల్గొండ జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ పెద్దలు.. సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలెం గ్రామంలో పర్యటించారు. ఆయన ప్రచారాన్ని నిరసిస్తూ.. గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. తెరాస సంక్షేమ పథకాలు తమకేమి అందలేదంటూ మహిళలు మండిపడ్డారు.
సాగర్ ఉప ఎన్నికల ప్రచారం
గత ఎన్నికల్లో.. ఎస్సీ వాడలో కమ్యూనిటీ హాల్ కట్టిస్తానని చెప్పి... మాట తప్పారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు అడిగే అర్హత తెరాసకు లేదంటూ ప్రచారాన్ని అడ్డకున్నారు.
ఇదీ చదవండి:వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే కార్యాలయాల్లోకి అనుమతి