తెలంగాణ

telangana

ETV Bharat / state

పెట్రోల్​ బంకుల్లో రాణిస్తున్న అతివలు - petrol

ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా అతివలు సైతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వీరంతా ఉన్నత విద్యావంతులు  అనుకుంటే పొరపాటే... ఎటువంటి ఆసరా లేక కుటుంబ పోషణ కోసం కొందరు... పిల్లలను ఉన్నత చదువులు చదివిచేందుకు మరి కొందరు మహిళలు  పెట్రోల్​ బంక్​లలో పనిచేస్తున్నారు.

పెట్రోలు పోస్తున్న మహిళా

By

Published : Aug 13, 2019, 11:36 PM IST

Updated : Aug 14, 2019, 3:53 PM IST

పెట్రోల్​ బంకుల్లో రాణిస్తున్న అతివలు

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఉన్న పెట్రోల్ బంకుల్లో మహిళలు ఎక్కువగా పని చేస్తున్నారు. ఎటువంటి ఆసరా లేక కుటుంబ పోషణ కోసం కొందరు... పిల్లలను ఉన్నత చదువులు చదివిచేందుకు మరి కొందరు మహిళలు పెట్రోల్​ బంక్​లలో పనిచేస్తూ.... జీవనం కొనసాగిస్తున్నారు. కూలి పనులకు వెళ్తే వచ్చే డబ్బు కన్నా ఇక్కడ ఆదాయం ఎక్కువగా ఉండడం వల్ల ఈ పనులపై మహిళలు ఆసక్తి చూపుతున్నారు. మిర్యాలగూడ, దామరచర్ల, వేములపల్లి మండలాలతోపాటు... నార్కట్​పల్లి- అద్దంకి జాతీయ రహదారిపైనున్న పెట్రోల్ బంకుల్లో మహిళలే అధికంగా పంపు ఆపరేటర్​గా పని చేస్తున్నారు.

బంకుల్లో పనిచేసే మహిళల్లో ఎక్కువగా భర్త చనిపోయిన కుటుంబాలున్నాయి. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక పెట్రోల్ పంపు ఆపరేటర్​గా పని చేస్తున్నారు వీరు. మరి కొందరు అతివలు భర్త సంపాదన సరిపోక పని చేస్తున్నారు. పిల్లలను బాగా చదివించుకోవాలనే దృక్పథంతో పని చేస్తున్నామని గర్వంగా చెబుతున్నారు ఇంకొందరు మహిళలు. తమ భర్తతో పాటు తామూ సంపాదిస్తూ కుటుంబ పోషణలో పాలు పంచుకున్నందుకు తమకు చాలా సంతోషంగా ఉందంటున్నారు.

ఇవీ చూడండి: హీరో నాగశౌర్యకు రూ.500 జరిమానా

Last Updated : Aug 14, 2019, 3:53 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details