తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇద్దర్ని బలిగొన్న వివాహేతర సంబంధం - ఆత్మహత్యలకు దారితీసిన వివాహేతర సంబంధం

భర్త చనిపోయి ఒంటరిగా జీవిస్తోందామె. కాలగమనంలో పక్కింట్లో నివసించే పెళ్లయిన వ్యక్తికి దగ్గరైంది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. కానీ అతనికి అప్పటికే పెళ్లై మరో భార్య ఉంది. కలిసి బతికే అవకాశం లేదని భావించి చావులో ఒక్కటయ్యారు. ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

ఇద్దర్ని బలిగొన్న వివాహేతర సంబంధం

By

Published : Oct 17, 2019, 5:39 PM IST

Updated : Oct 17, 2019, 5:57 PM IST

నల్గొండ జిల్లా నకిరేకల్​ మండలం తాటికల్​ గ్రామంలో పోతుల సైదులు(38) గీత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. అతనికి పెళ్లైంది. ఇద్దరు కుమారులు. పక్కంట్లోనే కారింగు భవాని(32) నివసిస్తుంది. ఒక కూతురు. భర్త కొద్ది కాలం క్రితం చనిపోయాడు. సైదులు, భవానిల మధ్య పరిచయం కాస్త.. వివాహేతర సంబంధంగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. ఇద్దరూ రెండు నెలల క్రితం పారిపోయారు.సైదులు భార్య బంధువులతో ఈ విషయంపై పంచాయతీ పెట్టించింది. భవానితో తిరగొద్దని బంధువులు, పెద్ద మనుషులు సైదులకు నచ్చజెప్పారు. కానీ భవానితో ప్రేమ బంధం అలాగే కొనసాగించాడు. బుధవారం ఇంట్లో ఈ విషయంపై పెద్ద గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన సైదులు, భవానిలు ఎలాగూ కలిసి బతకలేమని.. చావులో ఒకటవుదామని అనుకున్నారు. గ్రామ శివారులోని మామిడి తోటలో ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. భవాని కూతురు అనాథగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Oct 17, 2019, 5:57 PM IST

ABOUT THE AUTHOR

...view details