తెలంగాణ

telangana

ETV Bharat / state

organ donation in nalgonda: ఆమె చనిపోతూ... ఏడుగురి జీవితాల్లో వెలుగు నింపింది - జీవన్ దాన్ తాజా వార్తలు

organ donation in nalgonda: ధన సాయం చేస్తే ఖర్చు అయ్యే వరకూ గుర్తుండొచ్చు. మాట సాయం చేస్తే మనిషున్న వరకూ గుర్తుండొచ్చు. అవయవ దానంతో మరణానంతరం కూడా గుర్తుండి పోవచ్చు... ఎందరో జీవితాల్లో వెలుగులు నింపొచ్చు అనడానికి నల్గొండ జిల్లాకు చెందిన ఓ గృహిణిని నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తాను చనిపోతూ ఏడుగురి జీవితాలకు ప్రాణం పోసింది.

organ donation
అవయవదానం చేసిన గృహిణి

By

Published : Feb 17, 2022, 1:07 PM IST

organ donation in nalgonda: బతికినన్నాళ్లు ఎలా బతికినా పోయేలోపు నలుగురికి ఉపయోగపడే పనులు ఏమైనా చేసే పోవాలని పెద్దలు అంటారు. మాట సాయం చేయడానికే మనుషులు కరవైపోతున్న ఈ రోజుల్లో... నల్గొండ జిల్లా బాలంక వడ్డెర బజార్​కు చెందిన రుపాని సైదమ్మ తన ప్రాణం పోయినా తర్వాత కూడా అవయదానం చేసి ఏడుగురి జీవితాలకు ప్రాణం పోసింది.

జీవన్ దాన్ ఇచ్చిన పత్రం

అసలు ఏమైందంటే...

జిల్లా కేంద్రంలోని బాలంక వడ్డెర బజార్‌లో రుపాని వెంకన్న, సైదమ్మ( 35) దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఆమె ఇంటి దగ్గరే పనులు చేసుకుంటూ ఉంటుంది. ఈ నెల 8న సైదమ్మ అపస్మారక స్థితిలో ఉండటంతో.. గమనించిన భర్త మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని మలక్ పేట యశోద హాస్పిటల్​కు తీసుకొచ్చాడు. అత్యవసర వార్డులో వారం రోజుల పాటు చికిత్స అందించిన వైద్యులు ఆమె బ్రెయిన్ డెడ్‌ అయ్యినట్లు వెల్లడించారు.

అవయవదానం చేసిన గృహిణి

ఔదార్యం చాటుకున్న కుటుంబసభ్యులు...

ఇది తెలుసుకున్న జీవన్ దాన్ వైద్య బృంధం ఆమె కుటుంబ సభ్యులకు అవయవ దానంపై అవగహన కల్పించడంతో..కుటుంబసభ్యులు అంగీకరించారు. అప్పుడు సైదమ్మ 2 కిడ్నీలు, కాలేయం, 2 ఊపిరితిత్తులు, కంటి కార్నియాలు సేకరించి ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న రోగులకు శస్త్ర చికిత్స ద్వారా అమర్చినట్లు జీవన్ దాన్ ఇంఛార్జి, వైద్యురాలు స్వర్ణలత తెలిపారు.

ఇదీ చదవండి:A family need for help: భర్త, బిడ్డపై క్యాన్సర్​ పంజా.. దాతల సాయం అర్థిస్తున్న గృహిణి

ABOUT THE AUTHOR

...view details