తెలంగాణ

telangana

ETV Bharat / state

కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య - murder

నల్గొండ జిల్లా చిత్తలూరు గ్రామంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి కడతేర్చింది ఓ భార్య. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

By

Published : Jul 11, 2019, 12:01 AM IST

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామంలో చోటు చేసుకుంది. చిత్తలూరు గ్రామానికి చెందిన మల్లేశం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంకు చెందిన మమతతో గత ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన భర్త మల్లేష్​ను మమత ముఖంపై దిండు మోపి కర్రతో బాది హత్య చేసిందని సీఐ తెలిపారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

ABOUT THE AUTHOR

...view details