కూతురు ప్రేమ వివాహం చేసుకుందని సుపారీ గ్యాంగ్‌తో అల్లుడిని హత్య చేయించిన మారుతీరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మిర్యాలగూడ నుంచి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌కు చేరుకున్న మారుతీరావు.... 306 నెంబర్ గదిని అద్దెకు తీసుకున్నాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో డ్రైవర్‌తో కలిసి బయటికి వెళ్లిన ఆయన అల్పాహారం తీసుకొని 9 గంటల ప్రాంతంలో గదికి వచ్చాడు. 9.30 గంటలకు డ్రైవర్‌కు ఫోన్ చేసి కారులో ఉన్న కొన్ని పత్రాలు తీసుకురావాలని సూచించాడు. పత్రాలు తీసుకొని గదికి వెళ్లిన డ్రైవర్ వాటిని మారుతీరావుకు ఇచ్చేశాడు.
ఫోన్ స్పిచ్ఛాఫ్ వస్తోంది.. పైకెళ్లి చూడు
గదిలో పడుకుంటానని డ్రైవర్ శివ.. మారుతీరావును కోరగా... కారులోనే పడుకోవాలని సూచించాడు. ఉదయం 8 గంటల కల్లా బయటికి వెళ్లాల్సి ఉంటుందని సిద్ధంగా ఉండాలని డ్రైవర్‌కు చెప్పాడు. ఉదయం 7.30 ప్రాంతంలో డ్రైవర్ బయటికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అంతలోపే మారుతీరావు భార్య గిరిజ... డ్రైవర్ శివకు ఫోన్ చేశారు. మారుతీరావు ఫోన్ చాలాసేపటి నుంచి స్విచ్ఛాఫ్ వస్తోందని... పైకెళ్లి చూడాలని గిరిజ... డ్రైవర్‌కు సూచించింది. డ్రైవర్ పైకెళ్లి గది తలుపులు తెరిచే ప్రయత్నం చేశాడు. బయట ఉండి అరగంట పాటు.. తలుపులు తట్టాడు.
లోపల స్నానం చేస్తుంటాడని భావించిన డ్రైవర్.. ఆ తర్వాత అనుమానం వచ్చి... ఆర్యవైశ్య భవన్ సిబ్బందికి తెలిపాడు. మేనేజర్ మల్లికార్జున్ సాయంతో తలుపులు తోసేసి... లోపలికి వెళ్లిన డ్రైవర్... మారుతీరావు పరుపుపై పడిపోయి ఉండటాన్ని గమనించాడు. మేనేజర్ వెంటనే సైఫాబాద్ పోలీసులకు సమాచారమిచ్చాడు.
అమృత అమ్మ దగ్గరకు రా..
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.... వాష్బేసిన్తో పాటు పరుపుపై వాంతులు చేసుకున్నట్లు గుర్తించారు. విగతజీవిగా పడి ఉన్న మారుతీరావును వెంటనే అంబులెన్స్‌లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా... మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. గదిలో ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గిరిజా క్షమించు... అమృతా... అమ్మ దగ్గరకు రా అని లేఖలో రాసి ఉంది.
సుఫారీ గ్యాంగ్‌తో ప్రణయ్ హత్య..