తెలంగాణ

telangana

ETV Bharat / state

ముఖ్యమంత్రి దత్తత గ్రామంలో వైద్యశిబిరం

ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ ను ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ప్రారంభించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ క్యాంపును నిర్వహిస్తున్నట్లు తెలపారు.

By

Published : Nov 17, 2020, 4:38 PM IST

Whip Sunita started a health camp in Vasalamarri
వాసాలమర్రిలో హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన విప్ సునీత

ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ప్రభుత్వం హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేసింది. మంగళవారం విప్ గొంగిడి సునీత క్యాంపును ప్రారంభించారు. తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో గ్రామస్థుల ఆరోగ్య స్థితిని తెలుసుకోవడం కోసం ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించాలన్న సీఎం ఆదేశాల మేరకు ఉచిత హెల్త్ క్యాంప్ ప్రారంభించినట్లు తెలిపారు.

హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం సహకారంతో హెల్త్ క్యాంప్ ప్రారంభించారు. మొత్తం 100 మందితో కూడిన వైద్య బృందం గ్రామస్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా టాబ్లెట్లు పంపిణీ చేశారు. కలెక్టర్ అనితా రామచంద్రన్ దగ్గరుండి హెల్త్ క్యాంప్ నిర్వహణను పర్యవేక్షించారు.

ఇవీ చదవండి: ప్రభుత్వ వైఫల్యంతోనే రైతులకు ఇక్కట్లు: కాంగ్రెస్

ABOUT THE AUTHOR

...view details