తెలంగాణ

telangana

సంక్షేమ గురుకులంలో ఇద్దరికి డెంగీ, 120 మందికి జ్వరాలు

480 మంది ఉండే సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఇద్దరికీ డెంగీ ఉన్నట్టు నిర్ధారణ కాగా... 120 మందికి జ్వరం సోకినట్లు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆసుపత్రిలో చేరిన విద్యార్థులను పరామర్శించారు.

By

Published : Jan 30, 2020, 9:01 PM IST

Published : Jan 30, 2020, 9:01 PM IST

welfare gurukul Two members of dengue and 120 were fever at nalgonda
సంక్షేమ గురుకులంలో ఇద్దరికి డెంగీ, 120 మందికి జ్వరాలు

నల్గొండ జిల్లా నార్కట్​పల్లి మండలం చెర్వుగట్టు సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గత మూడు రోజులుగా జ్వరాలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కొంత మందిని నల్గొండ ప్రభుత్వాసుపత్రికి, మరికొందరిని కామినేని ఆస్పత్రికి తరలించారు.

వారిలో ఇద్దరికీ డెంగీ ఉన్నట్టు నిర్ధారణ కాగా... మిగతా వారు జ్వరంతో అవస్థలు పడుతున్నారు. పాఠశాలలో 480 మంది ఉండగా 120 మందికి జ్వరం సోకినట్లు వైద్యులు గుర్తించారు. విషయం తెలుసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించారు.

సంక్షేమ గురుకులంలో ఇద్దరికి డెంగీ, 120 మందికి జ్వరాలు

ఇదీ చూడండి :తెరాస గెలిస్తే ఇల్లందు బస్ డిపో హామీ ఏమైంది?

ABOUT THE AUTHOR

...view details