నల్గొండ జిల్లా చండూర్ మండలం తుమ్మలపల్లిలోని శ్రీ పార్వతి జడల రామ లింగేశ్వరస్వామి గుట్ట బండకు పడిన రంధ్రాల నుంచి నీరు ఉబికి బయటకు వస్తోంది. గుట్టపైనే స్వామి వారి ఆలయం ఉండటం.. దిగువ భాగాన నీరు బయటికి రావడం.. భక్తులంతా స్వామి పాదాల నుంచి నీరు వస్తోందని విశ్వసిస్తున్నారు. గుట్టపైన బండలు కొట్టడంలో భాగంగా కూలీలు కొన్ని చోట్ల హద్దులు గీసి డ్రిల్లింగ్ యంత్రాలతో రంధ్రాలు చేశారు. కొన్ని రంధ్రాల నుంచి నీరు బయటికి వస్తోంది. ఈ ప్రాంతంలో ఈ విధంగా నీరు బయటకు రావడం ఇదే ప్రథమమని స్థానికులు చెబుతున్నారు.
బండ నుంచి ఉబికివస్తున్న నీరు.. లింగేశ్వరుని మహిమేనా? - నల్గొండ జిల్లా లో అరుదైన ఘటన
కొన్ని చోట్ల ఎంత లోతులో బోర్లు వేసినా.. నీళ్లు పడని పరిస్థితి. అలాంటిది ఓ చిన్న గుట్టపైన రంధ్రంలోంచి నీరు ఉబికిరావడం ఆశ్చర్యపరుస్తోంది.
నల్గొండ జిల్లా లో అరుదైన ఘటన