నల్లగొండ పక్కనే ఉన్న జికె అన్నారం, వెలుగుల పల్లి, అక్కలయిగూడెం, గంధవారి గూడెల్లో నీటి కొరత తీవ్రంగా ఉంది. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోయాయి. తాగడానికి కూడా నీరు దొరకడం లేదంటూ ఆ గ్రామాలవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు ఓట్లు వేయించుకుని వెళ్లిపోయారు తప్పా... నీటి సమస్య పరిష్కారించే వారేలేరన్నారు. మిషన్ భగీరథ నీళ్లు ఇస్తామని పైపులైన్లు చిందరవందరగా పడేశారని మండిపడ్డారు. రోజు ఐదు నుంచి పది క్యాన్ల వాటర్ కొనుగోలు చేస్తున్నామని.. అవి కూడా సరిపోవడం లేదని వాపోతున్నారు.
తాగునీరు లేక ప్రజల బేజారు - bhageeratha
వేసవి కాలం నీరు లేక ప్రజలు చుక్కలు చూస్తున్నారు. కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరకడం లేదంటున్నారు నల్గొండ పక్కనే ఉన్న గ్రామవాసులు. నీటి కష్టాలు ఎన్నాళ్లంటూ నిలదిస్తున్నారు.
నీటి ఎత్తుకొస్తున్న చిన్నారి
ట్యాంకర్లు వచ్చినా
మధ్యాహ్నం ఒకటో, రెండో ట్యాంకర్లు మాత్రమే వస్తున్నాయని అవి ఎటూ సరిపోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి.... నీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. ఇవీ చూడండి: అమేఠీలో స్మృతి ఇరానీ మద్దతుదారుడి హత్య