నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కరోనా కేసులు పెరుగుతున్నందున వ్యాపార, వాణిజ్య వర్గాలు పది రోజులపాటు స్వచ్ఛంద లాక్డౌన్ను పాటిస్తున్నాయి. అందులో భాగంగానే పట్టణంలోని దుకాణ సముదాయలన్నింటిని మూసివేశాయి. కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు స్వచ్ఛంద లాక్డౌన్ ఒక్కటే సరైన మార్గమని మున్సిపల్ ఛైర్మన్ తిరునగరు భార్గవ్ వ్యాపార సంఘాలతో తెలిపారు.
మిర్యాలగూడలో పది రోజుల పాటు స్వచ్ఛంద లాక్డౌన్ - నల్గొండ జిల్లాలో స్వచ్చంధ లాక్డౌన్
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా వ్యాపార, వాణిజ్య వర్గాలు పది రోజులు స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తూ షాపులను మూసివేశారు.

మిర్యాలగూడలో పది రోజుల పాటు స్వచ్చంధ లాక్డౌన్
స్పందించిన వ్యాపారస్థులు ఈ రోజు నుంచి ఈ నెలాఖరు వరకు దుకాణాలు మూసివేస్తామని తెలిపినట్లు భార్గవ్ పేర్కొన్నారు. మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ల 13 మందికి కరోనా పాజిటివ్ రావడం వల్ల ఏవైనా సమస్యలు ఉంటే ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని డీఎస్పీ వెంకటేశ్వర్ రావు తెలిపారు.
ఇవీ చూడండి:తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా... కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్