కరోనా నేపథ్యంలో నల్గొండలో గణపతి విగ్రహాల తయారీపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహణపై సందిగ్ధత నెలకొనడంపై వారు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది వ్యాపారులు, భక్తులు కానీ అధిక సంఖ్యలో వచ్చి కొనుగోలు చేసేవారని, ప్రస్తుతం ఎవ్వరూ కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని బాధపడుతున్నారు. పనివాళ్లకు కూడా జీతం ఇవ్వలేని దుర్భర పరిస్థితి నెలకొందని వాపోయారు. ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం చేయాలని విగ్రహ తయారీదారులు విజ్ఞప్తి చేశారు.
వినాయక చవితిపై కరోనా ప్రభావం - వినాయక తయారీదారులపై కరోనా ప్రభావం
ప్రతీఏటా వినాయక చవితి వస్తోందంటే చాలు మూడు, నాలుగు నెలల ముందుగానే విగ్రహాల తయారీ సందడి కనిపిస్తుంటుంది. మారుమూల పల్లెనుంచి పెద్దపెద్ద పట్టణాలతోపాటు ఊరూరా, వాడవాడల్లోనే కాదు దేశ విదేశాల్లోనూ గణేష్ విగ్రహాలను నెలకొల్పి నవరాత్రులు నిర్వహించే సంప్రదాయం అనాదిగా వస్తోంది. కానీ ఈ ఏడాది వినాయక ఉత్సవాలపై కరోనా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.
వినాయక చవితిపై కరోనా ప్రభావం