నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుర్రంపోడు మండల తెరాస ఇంఛార్జి, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఉట్లపల్లిలో ఎన్నికల ప్రచారం సభలో ఆయన మాట్లాడుతుండగా... ఓ సామాజిక వర్గానికే వరాలు కురిపిస్తున్నారంటూ మరో వర్గం ఆందోళనకు దిగింది.
ఒక వర్గానికే హామీలా? ఎమ్మెల్యే కంచర్ల సభ అడ్డగింత - Telangana news
నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. నాగార్జున సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఉట్లపల్లిలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు.
Mlc kancharla bhupal reddy news
సభను అడ్డుకునే ప్రయత్నం చేయగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి గ్రామస్థులకు సర్దిచెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
ఇదీ చూడండి:వయసు 70 ఏళ్లు... బరిలో 17 సార్లు... 18వ సారి సాగర్ నుంచి...