Villagers Grand Welcomed the Jawan: దేశ రక్షణ కోసం ఉన్న ఊరును కన్న వారిని విడిచి సరిహద్దులో 20 ఏళ్లు పనిచేసిన ఓ జవానుకు సొంత గ్రామస్థులు అపురూప స్వాగతం పలికారు. నల్లొండ జిల్లా బట్టుగూడెంకు చెందిన లింగారెడ్డి చిన్న వయస్సులోనే ఆర్మీకి ఎంపికై వివిధ ప్రాంతాలలో విధులు నిర్వహించారు. ఉద్యోగ విరమణ చేసి గ్రామంలో అడుగు పెట్టిన సైనికుడిని డప్పు వాయిద్యాలతో ఎదురెళ్లి ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నారు.
20ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన జవాన్.. గ్రాండ్గా వెల్కమ్ చెప్పిన గ్రామస్థులు - ఉద్యోగ విరమణ చేసిన జవానుకు ఘనస్వాగతం
Villagers Welcomed the Jawan: అర్మీ జవానుకు అపురూప గౌరవం దక్కింది. చిన్న వయసులోనే ఆర్మీకి ఎంపికై ఓ జవాను 20సంవత్సరాల తరువాత స్వగ్రామానికి రావడంతో... గ్రామస్థులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని ఈ వేడుకను జాతర మాదిరి చేసుకున్నారు. బాజా, భజంత్రీలు, డప్పు వాయిద్యాలతో జవానుకు ఘన స్వాగతం పలికారు.
An Army Jawan Got An Incredible Honour
దేశానికి సేవ చేసే అవకాశం రావటం అదృష్టమని లింగారెడ్డి తెలిపారు. దాదాపు 100శాతం అక్షరాస్యత సాధించి ఇప్పటికే ప్రత్యేకంగా నిలిచిన ఈ గ్రామస్థులు ప్రభుత్వ మాజీ ప్రధానోపాధ్యాయుడ్ని సర్పంచిగా ఎన్నుకుని గ్రామాభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు.
ఇవీ చదవండి: