తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ పాఠశాలలో కూరగాయలు అక్కడే పండించుకుంటారు - వట్టిమర్తి హైస్కూలు ఆవరణలో కూరగాయల సాగు

పాఠశాల ఖాళీ స్థలాలు చెత్త చెదారంతో నిరుపయోగంగా ఉన్నవి మనవి చూసుంటాం... కానీ పాఠశాల ఆవరణను మొక్కలతో ఆహ్లదంగా మార్చడమే కాకుండ... ఆదాయం కూడా పొందడం చూశారా. ఖాళీ స్థలంలో కూరగాయలు పండిస్తూ... ఇతర పంటలతో ఆదాయం ఆర్జిస్తున్న విద్యాలయం చూడాలంటే నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి జడ్పీహెచ్​కు వెళ్లాల్సిందే..

ఆ పాఠశాలలో కూరగాయలు అక్కడే పండించుకుంటారు

By

Published : Oct 10, 2019, 2:24 PM IST

ఆ పాఠశాలలో కూరగాయలు అక్కడే పండించుకుంటారు

మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించేందుకు పాఠశాల ఆవరణలోనే కూరగాయల సాగు చేపట్టారు ఉపాధ్యాయులు. ఆరెకరాల స్థలంలో నిమ్మ, కొబ్బరి పంటలతో పాటు కూరగాయలు సాగు చేస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు నల్గొండజిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి జడ్పీహెచ్​ ఉపాధ్యాయులు.

వనరులు వాడకం అంటే ఇలా ఉండాలి

గతంలో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నర్ర రాఘవ రెడ్డి స్ఫూర్తితో గ్రామస్థులంతా కలిసి ఆరెకరాల స్థలం సేకరించి పాఠశాలకు ఇచ్చారు. అప్పటి నుంచి ఈ స్థలాన్ని లీజుకివ్వడం ద్వారా ఆదాయం వచ్చేది. కొన్నేళ్లుగా ఇక్కడ వంగ, బీర తదితర కూరగాయలు సాగుచేస్తూ మధ్యాహ్న భోజననానికి అవసరమైన పంటలు పండిస్తున్నారు ఉపాధ్యాయులు. వాటితో పాటు నిమ్మ, కొబ్బరి చెట్ల నుంచి కూడా ఆదాయం లభిస్తోంది. పంటల వల్ల పాఠశాల వాతావరణం ఆహ్లదంగా ఉండడమే కాకుండా ఆదాయం కూడా వస్తుందంటున్నారు ఉపాధ్యాయులు.

అందరూ బాధ్యతగా

పాఠశాల ప్రాంగణంలో రకరకాల పూలు, పండ్ల మొక్కలు పెంచుతున్నారు. విద్యార్థుల కోసం క్రీడా ప్రాంగణం కూడా తయారు చేశారు. వీటన్నింటిపై ప్రత్యేక శ్రద్ధతో సంరక్షిస్తున్నారు ఉపాధ్యాయులు, విద్యార్థులు.

ఇంటిని మరిపిస్తోంది

పాఠశాలకు వస్తే ఇల్లు కూడా మరిచిపోతున్నామని... ఆహ్లదకర వాతావరణంలో చదువు హాయిగా సాగిపోతోందని అంటున్నారు విద్యార్థులు. పచ్చదనంతో అదరినీ ఆకట్టుకోవడమే కాకుండా ఏటా పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది ఈ విద్యాలయం. కాంక్రీటు జంగిల్​లో యాంత్రికంగా సాగుతున్న పాఠశాలలు.. ఈ స్కూలుని ఆదర్శంగా తీసుకోవాలి.

ఇదీ చూడండి: విద్యార్థులకు దిక్సూచి... "మై ఛాయిస్​ మై ఫ్యూచర్"​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details