నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామంలో ఉత్తర ద్వార దర్శనం కన్నుల పండువగా జరిపించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా ఈ క్రతువు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నేరడ గ్రామంలో ప్రత్యేక పూజలు చేశారు.
నేరడలో వైభవంగా వైకుంఠ ఏకాదశి పూజలు
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో భక్తుల పూజలు నిర్వహిస్తున్నారు. స్వామి వారు ఉత్తర ద్వార దర్శనం భక్తులకు దర్శనమిస్తున్నారు. చిట్యాల మండలం నేరడ గ్రామంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
నేరడ గ్రామంలో వైకుంఠ ఏకాదశి పూజలు
తెల్లవారుజాము నుంచే భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా కైంకర్యాలు జరిపించారు. అనంతరం చిన్నాపెద్దా తిరుప్పావై పఠించారు. భజనలు కీర్తనలతో పారవశ్యంలో మునిగిపోయారు. స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
ఇదీ చూడండి:తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు